in

Most awaited sequels of blockbuster hit films in Tollywood!

10. HIT 3

హిట్’ ప్రాంచైజీ ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. శైలేష్ కొల‌ను దర్శ‌కత్వం వ‌హించిన ఈ సిరీస్ కి మార్కెట్ లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో నిర్మాత‌గా ఉన్న నాని నే థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కోసం హీరోగా మారిపోయాడు. మూడ‌వ‌భాగంలో నాని పాత్ర ఎంత ర‌ఫ్ గా ఉంటుందో కూడా క్లైమాక్స్ లో రివీల్ చేసారు. అర్జున్ స‌ర్కార్ అనే బ్రూట‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నాని క‌నిపించ‌బోతున్నాడు.

09. DOUBLE ISMART

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, డేషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పూరి బ్లాక్ బస్టర్ విజయం సాధించారు. ఇక లైగర్ తో డిజాస్టర్ మూటగట్టుకున్న పూరి..ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ను అనౌన్స్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం వీరి కాంబోలో డబుల్ ఇస్మార్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే..ప్లాప్స్ లో ఉన్న రామ్ ఇంక పూరి కు ఈ సినిమా విజయం ఇస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

08. AKHANDA 2

బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ చేసిన మూవీ అఖండ..బాలయ్యబోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా..ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న అఖండ 2 కోసం ప్రేక్షకులు చాలానే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1st పార్ట్ లో బాలయ్యను అగోర క్యారెక్టర్ లో చూపించి దుమ్ము లేపాడు బోయపాటి..మరి అఖండ 2 సినిమాను ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో చూడాల్సి ఉంది. అఖండ2 సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల కానుందని తెలుస్తోంది..

07. TILLU CUBE

DJ టిల్లు హిట్ అవ్వడంతో..సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన టిల్లు స్క్వేర్‌ కూడా మంచి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. చిన్న, పెద్ద, యువత అందరినీ నాన్‌స్టాప్‌గా నవ్విస్తూ అలరించింది. డీజే టిల్లు గా వచ్చి యువతలో ఓ క్రేజ్‌ సంపాదించుకున్న టిల్లు ఈసారి టిల్లు స్క్వేర్‌తో బ్రాండ్‌గా మారిపోయాడు. టిల్లు హిట్‌ టాక్‌తోపాటు అంచనాలకు మించి కలెక్షన్‌లు కూడా వచ్చాయి..అంతే కాదు ‘టిల్లు క్యూబ్‌’ లో సూపర్‌ హీరోగా వస్తాడట..!!

06. KARTIKEYA 3

నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన కార్తికేయ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2014లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. సైన్స్‌ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీనికి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ 2 కూడా మంచి విజయాన్ని నమోదుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేవలం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి విజయాన్ని అందుకుంది..ఇప్పుడు కార్తికేయ 3 మీద బారి అంచనాలు ఉన్నాయి..!!

05. JAI HANUMAN

యంగ్ హీరో తేజా సజ్జాప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్’ HanuMan. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. 2024 సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేశారు. చిన్న సినిమాగా ఏకంగా మహేశ్ బాబుగుంటూరు కారం’తో పోటీగా విడుదలైన ఈ చిత్రం సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. పెద్ద చిత్రాలను ఢీకొని భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అటు ప్రశాంత్ వర్మ, ఇటు తేజా సజ్జా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు.

04. SALAAR PART 2 – SHOURYANGA PARVAM

ప్రభాస్ సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడింది. వెయ్యి కోట్ల వరకు రాబడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఏడు వందల కోట్ల వరకే ఆగిపోయింది. సలార్ మీద మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ప్రభాస్ స్టామినా వల్ల ఆ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. నార్త్‌లో సలార్ అంతగా ఆడలేదు. కన్నడలోనూ అంతగా ఆకట్టుకోలేదు. తెలుగులో, ఓవర్సీస్‌లో సలార్‌కు బాగానే కలెక్షన్లు వచ్చాయి..సినిమా సీక్వెల్ మీద క్రేజ్ మాత్రం భారీగా ఉంది..

03. KGF CHAPTER 3

రాకీ భాయ్ గ ఇండియన్ స్క్రీన్ మీద దండయాత్ర చేసాడు యాష్..KGF చాప్టర్ 2 కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి, పార్ట్ త్రీ మీద చాలా ఆశ‌లు పెంచేసింది. 1200 కోట్ల‌కు మించిన వ‌సూళ్లంటే మాట‌లా? RRR పాటు దేశం మొత్తం మాట్లాడుకున్న సినిమా ఇది. కాక‌పోతే దీన్ని ఫ్రాంచైజీ క‌న్నా, KGF యూనివ‌ర్స్ గా ప్లాన్ చేస్తున్నారు. అంటే KGF తోపాటు మ‌రికొన్ని సినిమాలుకూడా వ‌స్తాయి. ఇవ‌న్నీ ఎక్క‌డో ఒక చోట KGF తో క‌నెక్ట్ అవుతాయి..అంటే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి..!!

02. KALKI 2

రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్​లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీ ఎంతటి ప్రభంజనాలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిలీజైనప్పటి నుంచి బాక్సాఫీస్​లు షేక్​ చేస్తూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంటోంది. రిలీజై వారమైనప్పటికీ సూపర్ క్రేజ్​తో థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు ప్రభాస్ ఇచ్చిన హింట్​ బేస్​ చేసుకుని అభిమానులు ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు.

01. PUSHPA – THE RULE

ల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రెండేళ్ల క్రితం వచ్చి సంచలనాలు సృష్టించిన పుష్ప 1 సీక్వెల్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 లో పుష్ప రాజ్ రూలింగ్ చూడాలని పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. పుష్ప 2 ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. అయితే ఈ సినిమా కు DEC 17th రిలీజ్ డేట్ లాక్ చేయగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.

boyapati srinu wants thaman to be replaced for akhanda 2 music?

omg, bollywood beauty Janhvi Kapoor recalls feeling paralysed!