in

ashika ranganath changed her approach of selecting scripts!

కేవలం అందంతో మాత్రమే కాకుండా నటనతో ప్రేక్షకుల మనసుల్ని గెలవాలన్నదే తన లక్ష్యం అంటున్నది కన్నడభామ ఆషికా రంగనాథ్‌. ఈ గురువారం ‘సర్దార్‌ 2’ సినిమా ద్వారా పాన్‌ ఇండియా ప్రేక్షకులను పలకరించింది ఈ అందాలభామ. పాత్రల ఎంపిక గురించి ఆషికా మాట్లాడుతూ ‘సినీరంగంలోకి ప్రవేశించిన రెండుమూడేళ్లకే తెలుగులో అవకాశాలు వచ్చాయి..

ఆ టైమ్‌లో ఎలాంటి పాత్రలను ఎంచుకోవాలో కూడా నాకు తెలియదు. వచ్చిన ప్రతి సినిమాకూ ఓకే చెప్పాను. ఇప్పుడు నాలో పరిపక్వత వచ్చింది. స్టార్‌ హీరోల పక్కన మెరవడం కంటే, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడానికే ఆసక్తిగా ఉన్నా. కథ విన్నప్పుడు అందులో నా పాత్ర, ప్రేక్షకులపై దాని ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సినిమాలకు ఓకే చెబుతున్నాను. నటించిన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించడమే నా లక్ష్యం’ అంటూ చెప్పుకొచ్చింది అషికా రంగనాథ్‌..!!

Kareena Kapoor Calls Out Herd Mentality: Cites Ranbir's Animal

Kareena Kapoor Calls Out Herd Mentality: Cites Ranbir’s Animal

happy birthday AMALA AKKINENI!