in

dusky beauty Pooja Hegde in talks for Tillu Cube?

పూజాహెగ్డేకు గత కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో ఈ భామ కెరీర్‌ సాగుతున్నది. తాజా సమాచారం ప్రకారం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడు ఓ గుడ్‌న్యూస్‌ను అందుకున్నట్లు తెలిసింది..టిల్లు, టిల్లు స్వేర్‌ చిత్రాలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. టిల్లు పాత్రలో హీరో సిద్ధు జొన్నలగడ్డ తనదైన మేనరిజమ్స్‌, హైదరాబాదీ కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు తెలిసింది. డీజే టిల్లు, టిల్లు స్వేర్‌ చిత్రాల్లో కథానాయిక పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో భాగంలో పూజహెగ్డేను కథానాయికగా తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి..!!

Vamshi Paidipally Bollywood debut with Shahid Kapoor?

happy birthday sundeep kishan!