in

animal ranbir kapoor’s cameo in pushpa the rule?

ఇండియన్ సినిమాలంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అన్నట్టు ఉన్న పరిస్థితుల నుంచి తెలుగు సినిమా ఉనికిని చాటుకుంది. రీసెంట్ గా ప్రభాస్ సలార్ మూవీ ఆంతర్జాతీయ స్థాయిలో మెప్పించింది. వీటన్నిటి కారణంగా భాషా బేధాలు, ప్రాంతీయ వాదాలు పోయి  నటులుగా రాణిస్తున్నారు. ఇప్పుడు నార్త్ హీరోలు కూడా సౌత్ సినిమాల్లో నటించటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 లో రణబీర్ కపూర్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప 2 లో రణబీర్ తో  గెస్ట్ అప్పియరెన్స్ చేయిస్తున్నారట సుకుమార్. సందర్భాన్ని బట్టే రణబీర్  క్యారెక్టర్ ఎంట్రీ ఉండనుంది అని సమాచారం. ఈ పాత్ర కోసం మొదట ఓ తెలుగు స్టార్ హీరోని తీసుకోవాలని అనుకున్నారట సుకుమార్. కానీ ఆ హీరో బిజీగా ఉండడం వల్ల ఈ క్యారెక్టర్ లో యానిమల్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న రణబీర్ కపూర్ అయితే బాగుంటుందని, ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది..!!

Glamour Overdose By Milky Beauty!

actress Surbhi Chandana ‘accuses’ airline of mentally torturing her!