in

pushpa is 10 times more than kgf : says uppena director!

లెక్క‌లు మాస్టార్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం పుష్ప. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న ప్ర‌ధాన పాత్ర‌ల‌లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఆగ‌స్ట్ 13న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ, క‌రోనా వారి ఆలోచ‌న‌ల‌కు అడ్డుగా మారింది. రెండు భాగాలుగా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, తొలి పార్ట్‌ని ఇదే ఏడాది విడుద‌ల చేయ‌నున్నారు.

పుష్ప చిత్రానికి సంబంధించి విడుద‌లైన ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో ఎన్ని రికార్డులు న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉండ‌గా, వాటిని మ‌రింత పెంచాడు ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ క్లబ్ హౌస్ ఇంట్రాక్షన్ లో , తాను పార్ట్ 1 చూశానని అందులో బన్నీ నటన , సుకుమార్ మాస్ ఎలివేషన్స్ ఒక పది కేజీయఫ్ లని కలిపితే పుష్ప పార్ట్ 1 అని తెలిపాడు. బుచ్చిబాబు మాట‌ల‌తో అభిమానులు త‌గ్గేదే లే అంటున్నారు.

Samantha Akkineni signs new pan-India web series!

uppena!