in

Nikhil’s Karthikeya 2 achieves a massive record in usa!

మాత్రం సందడి లేకుండా విడుదలైన ‘కార్తికేయ 2’ సినిమా ఘన విజయం సాధించింది. హీరో నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా విడుదలైన ఇతర భాషల్లో సైతం ప్రేక్షకుల మెప్పును పొందింది. బాలీవుడ్ లో సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ను, రూ. 50 కోట్లకు పైగా షేర్ ను సాధించింది..

మరోవైపు, అమెరికాలో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లను సాధించింది. అంతేకాదు… నాలుగో వారంలో కూడా 80కి పైగా లొకేషన్లలో రన్ అవుతున్న తొలి తెలుగు చిత్రంగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. గతంలో ఏ తెలుగు సినిమా కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషించారు..!!

ALLUDIKI TAGgINA ATha!

Samantha Ruth Prabhu: No More Glamour Roles