in

top 10 Actresses Who Played Prostitutes in tollywood!

చాలా మంది స్టార్ హీరోయిన్లు వేశ్య పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా, విమర్శకుల ప్రశంసలు, అవార్డులు దక్కించుకోవాలన్నా వేశ్య పాత్రలు ఎంచుకోవడం ఒక మంచి ఆప్షన్‌గా వారు భావిస్తున్నారు. అలా అని ఇవి అంత సులభంగా చేయగలిగే పాత్రలు కావు. చాలా కష్టతరమైన పాత్రలు. బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, రొమాన్స్…ఇలా ఎన్నో షేడ్స్ ప్రదర్శించాల్సి వస్తుంది..అలాంటి వేశ్య పాత్రలు తెలుగులో చేసి మెప్పించిన భామలు ఎవరో చూద్దాం రండి..

10. SWETHA BASU IN ‘MADHUR’

దివరకే సెక్స్ రాకెట్‌లో ఇరుక్కొగా.. ఇప్పుడు అదే పాత్ర చేయడం చర్చకు దారితీసింది. దీంతో ఆమె రియల్ లైఫ్‌లో జరిగిన పరిస్థితులు రీల్ లైఫ్‌లో కనిపిస్తాయా అనే ఊహాగానాలు నెలకొన్నాయి. లాక్ డౌన్ వల్ల జరిగిన పరిస్థితులను తెరమీద చూపిస్తూ..సెక్స్ వర్కర్‌గా శ్వేతబసు నటిస్తున్నారు. ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉండే సెక్స వర్కర్ మధురుతో కలిసి తెలుసుకున్నారు శ్వేత.

09. SADHA IN ‘SRIMATHI 21F’

దా నటించిన చిత్రం ‘శ్రీమతి 21 F’, అసలు ఈ చిత్రం రిలీజ్ అయినా విషయం కూడా ఎవరికీ తెలీకుండా పోయింది.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో సదా కి తీవ్ర నిరాశ ఎదురైంది. వేశ్య పాత్ర వేసినా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం తీవ్రంగా డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం సదాకి చేతిలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తో సినీ పరిశ్రమలో తన ఊసే లేదు.

08. SHOBITHA DHULIPALA IN ‘MUTHOON’

సెక్స్ వర్కర్ పాత్రలో నటించడం ఛాలెంజింగ్ గా ఉంటుందని..అందుకే ‘మూతోన్’ సినిమాలో అలాంటి పాత్ర చేసానని చెబుతోంది మన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల..కెరీర్ ఆరంభంలోనే ఇటువంటి పాత్ర చేసి శోభిత పెద్ద సాహసం చేసిందనే చెప్పాలి..లిప్ లాక్స్, బోల్డ్ క్యారెక్టర్లలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తన మొదటి సినిమా ద్వారా చెప్పకనే చెప్పింది ఈ మాజీ మిస్ ఇండియా..

07. BINDHU MADHAVI IN ‘SEGA’

వకాయ్ బిర్యానీ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగు నటి బింధు మాధవి 2011లో వచ్చిన గౌతం మీనన్ చిత్రం ‘సెగ’లో వేశ్య పాత్ర పోషించింది. సినిమా పెద్దగా ఆడక పోయినా బింధుమాధవికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. గౌతమ్ మీనన్ సినిమాలో ప్రతి పాత్రకి ప్రత్యేకత ఉంటుంది. అలాగే అతని నిర్మాణంలో తెరకెక్కిన సెగ మూవీలో విజి పాత్ర అందరి మదిలో ముద్ర పడి పోయింది. ఈ రోల్లో బిందు మాధవి జీవించేసింది.

06. SHRADDHA DAS IN ‘PURE SOLE’

శ్రద్దాదాస్..ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు ధ‌రించి యూత్‌ని ఆక‌ట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది. ఒక వేశ్య మనో భావాన్ని క‌ల్మ‌షం లేని హృదయాన్ని క‌ళాత్మ‌క దృష్టి తో తెర‌కెక్కించిన ఈ చిత్రం పేరు ‘ప్యూర్ సోల్‌’..పేరున్న న‌టీన‌టులు ఇలాంటి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాలు చేస్తే స‌మాజానికి ఎంతో కొంత మేలు జ‌రుగుతుందనే చెప్పాలి..

05. SHREYA IN ‘PAVITHRA’

క పవిత్ర సినిమాలో శ్రియ సరన్ వేశ్యగా నటించి నటిగా తన స్థాయిని పెంచుకుంది. అందులో శ్రియ అందాల ఆరబోత మరియు నటన చాలా బాగుంటుంది..ప్రస్తుతం సొసైటీలో మహిళలకి జరుగుతున్న అన్యాయాలను ఆధారంగా తీసిన సినిమా ఇది..మంచి మెసేజ్ తో పాటు..అడల్ట్ కంటెంట్ చూసినవాళ్లకు చూసినంత..అన్నట్టు నటించింది శ్రేయ..

04. CHARMI IN ‘JYOTHI LAKSHMI’

ఛార్మీ గతంలో ‘ప్రేమే ఒక మైకం’ చిత్రంలో సెక్స్ వర్కర్ గా చేసి మరోసారి అలాంటి పాత్రను జ్యోతి లక్ష్మి లో కూడా చేసింది..మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవల ఆధారంగా తెరకెక్కించారు. ’జ్యోతి లక్ష్మి’ సినిమాపై ’జ్యోతి లక్ష్మి’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేయడం విశేషం..సినిమాపై పుస్తకం వెలువడటం చార్మీ కి అరుదైన గౌరవం దక్కినట్టయ్యింది.

03. TABU IN ‘PANDURANGADU’

బాలకృష్ణ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పాండురంగడు’ చిత్రంలో టబూ వేశ్య పాత్రను పోషించారు. అంతకుముందు 2002లో హిందీ చిత్రం ‘చాందినీబార్’లో వేశ్యగా నటించి జాతీయ పురస్కారం అవార్డు కూడా అందుకున్నారు. టబూ వంటి హీరోయిన్ ఇలాంటి రోల్ చేయడం..దానికి అవార్డు రావడం బహుశా ఈ విషయం చాల కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉంటుంది

02. RAMYA KRISHNA IN ‘SUPER DELUXE’

శివగామి లాంటి పవర్‌ఫుల్ పాత్ర తర్వాత ఆమె శృంగార తారగా నటించడం అప్పట్లో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది..‘కొన్ని పాత్రలను డబ్బు కోసం చేస్తాం. ‘కొన్ని పాత్రలు పేరు కోసం, పాపులారిటీ కోసం చేస్తాం. ఇంకొన్నింటినీ అభిరుచితో చేస్తాం. ‘సూపర్ డీలక్స్’ సినిమాలో వేశ్య పాత్రను అభిరుచితోనే చేశా’ అని రమ్యకృష్ణ అన్నారు..ఈ ఏజ్ లో అలాంటి పాత్ర చేసిందంటే రమ్య కృష్ణ గారి ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు ఏమంటారు..

01. ANUSHKA IN ‘VEDHAM’

ఉద్యోగానికైనా ఎంత అనుభవం ఉంటే అంత ఎక్కువ డబ్బులిస్తారు. కానీ మా ఉద్యోగానికి అనుభవం ఎంత తక్కువుంటే అంత ఎక్కువ డబ్బులిస్తారు…’ అంటూ అనుష్క వేదంలో చెప్పిన డైలాగ్‌ ఎప్పటికి గుర్తు ఉండిపోతుంది. అందులో ఆమె పాత్ర గెటప్, డైలాగ్ లు మాస్ లో మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి.. అసలు ఎవ్వరు ఊహించని పాత్ర చేసి సినీ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి మన స్వీటీ అనుష్క..0

happy birthday krishnam raju!

Keerthy Suresh’s Expensive Gifts To ‘dasara’ Unit Members!