in

Keerthy Suresh’s Expensive Gifts To ‘dasara’ Unit Members!

హానటి’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. తన అద్భుత నటనతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఓ వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఇతర సినిమాల్లోనూ నటిస్తోంది. నేచురల్ స్టార్ నానితో కలిసి ‘దసరా’ అనే మూవీ చేస్తోంది. 90వ కాలం నాటి స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది.

షూటింగ్ చివరి రోజున కీర్తి సురేష్ సినిమా యూనిట్ కు సర్ప్రైజ్ గిప్టులు ఇచ్చింది. కీర్తి సురేష్ చిత్ర యూనిట్ కి బంగారు కానుకలు ఇచ్చి  ఆశ్చర్య పరిచింది. ఈ మూవీ కోసం చేసిన 130 మందికి ఒక్కొక్కరికి 2 గ్రాములు బంగారు నాణేలను అందించింది. ఈ బంగారు నాణేల కోసం కీర్తి సురేష్ దాదాపు రూ. 13 లక్షలు ఖర్చు చేసిందట. బంగారు నాణేలు అందుకు చిత్ర బృందం సభ్యులు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ బహుకరించిన బంగారు నాణేల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి..!!

top 10 Actresses Who Played Prostitutes in tollywood!

happy birthday Naga Shaurya!