
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన 'రియాలిటీ' సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కిరణ్ అబ్బవరం కెరీర్లో 14వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రికార్డ్' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాకుండా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, అందులో ఒక స్మార్ట్‌ఫోన్‌ను చూపించి కథపై కొంత ఆసక్తిని కలిగించారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో రక్తం రంగులో కనిపిస్తున్న ఎర్రటి పౌర్ణమి చంద్రుడి ముందు ఒక గుర్రాన్ని చూపించారు.
ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా కథలో ఏదో కొత్తదనం ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎర్రటి చంద్రుడు, గుర్రం కలయిక సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఈ పోస్టర్ వెనుక ఉన్న కథాంశం ఏమిటనేది చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి సంయుక్తంగా వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, థీ స్టోరీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీర కొగటం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, ప్రముఖ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మరోవైపు కిరణ్ అబ్బవరంఇటీవల 'క' సినిమాతో మంచి విజయాన్ని అందుకుని తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'దిల్రూబా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు 'రియాలిటీ', 'రికార్డ్' వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా 'రికార్డ్' ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా సాధారణ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉండబోతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా చాలా విభిన్నంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఎర్రటి పౌర్ణమి చంద్రుడు, గుర్రం వంటి అంశాలను చూపించడం ద్వారా ఈ సినిమా కథలో మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ప్రీ లుక్‌లో స్మార్ట్‌ఫోన్‌ను చూపించడం, ఫస్ట్ లుక్‌లో పూర్తిగా భిన్నమైన విజువల్‌ను విడుదల చేయడంతో అసలు కథ ఏ జానర్‌కు సంబంధించిందనే ఆసక్తి నెలకొంది..!!
