in

TOP 10 STAR HEROINES OF TOLLYWOOD WHO DANCED FOR ITEM SONGS!

గతంలో ఐటమ్ సాంగ్ చేయాలంటే వాటి కోసం కొంతమంది ఆర్టిస్ట్ లు ఉండేవాళ్ళు. సిల్క్ స్మిత, జయమాలిని, జయచిత్ర లాంటి ఆర్టిస్టులు నటనతో పాటు స్పెషల్ గా ఐటెం సాంగ్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. దీంతో హీరోయిన్స్ కాస్త ఐటెం భామలుగా మారిపోతున్నారు. బాలీవుడ్ లో ఈ పద్ధతి మొదలైంది. టాప్ ఫాంలో ఉన్నప్పుడే కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేశారు. దీంతో ఇది తెలుగుకి కూడా పాకింది. ఆ వివరాలు ఏంటో ఓ లుక్ వేద్దాం రండి..!!

10. ANASUYA IN ‘CHAAVU KABURU CHALLAGA’!   

తెలుగు హాట్‌ యాంకర్‌ అనసూయ ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమెలోని హాట్‌ అందాలను తెరపై సరికొత్తగా ఆవిష్కరించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు ఐటెమ్‌ సాంగ్‌లు చేసిన అనసూయ తాజాగా మరో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. యంగ్ హీరో తో కలిసి దరువేసింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా అను అందాలు, కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి..సెక్సీ అందాల భామ అనసూయ `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ హీరోగా వచ్చిన `చావు కబురు చల్లగా` అనే చిత్రంలో చేసిన ఐటెమ్‌ సాంగ్‌ ఇది.

09. ANJALI IN ‘SARRAINODU’!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చాలా సాఫ్ట్ గా కనిపించిన అంజలి ఆ సినిమాతో మంచి పేరు దక్కించుకుంది..ఈ సినిమాలో మొత్తం పల్లెటూరి అమ్మాయి గానే కనిపించింది అంజలి. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆమె వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది. పద్ధతి కి పట్టు చీర కట్టినట్టు గా ఉండే అంజలి సరైనోడు సినిమాలో ఐటమ్ సాంగులకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.. అంజలినేనా అని అందరూ ఆశ్చర్యపోయేలా తన ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో మంది హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

08. ANUSHKA IN ‘STALIN’!

లాగే ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సైతం ఓ సారి ఐటెం భామ గ మారింది…అనుష్క తొలి సారి ఐటెం సాంగ్ చేసింది ఏ హీరో కోస‌మో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `సూపర్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క‌.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `విక్రమార్కుడు`తో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుని అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న అనుష్క‌.. `స్టాలిన్` సినిమాతో స్పెష‌ల్ సాంగ్ చేసింది.

07. HEBBAH PATEL IN ‘RED’!

కెరీర్ లో తిరుగులేని సక్సెస్ లు చూసిన వాళ్ళు కూడా అర్ధాంతరంగా మరుగున పడిపోతారు. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2014 లో తెలుగు నాట హీరోయిన్ గా అడుగు పెట్టి ఆదిలో మంచి విజయాలు చవి చూసిన హెబ్బా పటేల్ ఇపుడు దాదాపు కనుమరుగు అయ్యే స్థితి కొచ్చేసింది..ఐటెం సాంగ్ లతో పాపులర్ అయిన హీరోయిన్ ల మాదిరిగా తన కెరీర్ కూడా ఊపు అందుకొంటుందన్న నమ్మకం తో చేసిన ఈ సాంగ్ హిట్ అయ్యింది.. కానీ తనకు మాత్రం గుర్తింపు రాలేదనే చెప్పాలి.

06. REGINA CASSANDRA IN ‘ACHARYA’!

రో హీరోయిన్ రెజీనా..కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసింది. కొరటాల శివ డైరెక్షన్లో.. చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో శానాకష్టం అంటూ యూత్ తో పాటు అందర్నీ టార్గెట్ చేసింది. మెగాస్టార్ కోసమే స్పెషల్ సాంగ్ చేశానన్న రెజీనా.. తన ఎక్స్ ప్రెషన్స్ తో సాంగ్ ని వేరే లెవల్ కి తీసుకెళ్లింది. ఇలా ఒక వైపు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లుగా పనిచేస్తూనే.. మరో వైపు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు మన హీరోయిన్లు.

05. SHRUTHI HAASAN IN ‘AAGADU’!

హేష్ బాబు హీరోగా వచ్చిన ‘ఆగడు’ చిత్రంలో శృతి హాసన్ ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఐటం సాంగు చేయడమే ఒక ఆశ్చర్యం అయితే…ఆమె ఈ ఒక్కసాంగ్ చేయడానికి తీసుకున్న రెమ్యూనరేషన్ అప్పట్లో మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఫిల్మ్ నగర్ వార్తల ప్రకారం ఐటం సాంగుకు ఆమె రూ. 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందట. సౌత్ సినిమా హీరోయిన్స్ లో కేవలం ఒక సాంగ్ కోసం ఇన్ని డబ్బులు తీసుకోవడం అప్పట్లో అదే ఫస్ట్ టైం..

04. THAMANNA IN ‘JAI LAVA KUSA’!

లేటెస్ట్ గా వరుణ్ తేజ్ గని మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్ చేసిం టీమ్. వరుణ్ తేజ్ గని మూవీలో కొడ్తే సాంగ్ తో కుర్రాళ్లని గిలిగింతలు పెట్టడానికి రెడీ అయ్యింది. పోస్టర్ తోనే సాంగ్ మీద ఇంట్రస్ట్ పెంచేస్తోంది తమన్నా. ఈ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చెయ్యడం కొత్తేం కాదు.. లాస్ట్ టైమ్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ లో ఆజ్ రాత్ పార్టీ హే అంటూ ఎంటర్ టైన్ చేసింది. అంతేకాదు.. కేజీఎఫ్ లో కూడా క్లబ్ సాంగ్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది తమన్నా.

03. KAJAL AGARWAL IN ‘JANATHA GARAGE’!

న్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో కాజల్ పెర్ఫామ్ చేసిన పక్కా లోకల్ ఐటమ్ సాంగ్ థియేటర్స్ లో ఫ్యాన్స్ చేత డాన్స్, విజిల్స్ వేసేలా చేసింది. బాలీవుడ్ లో కూడా కాజల్ స్పెషల్ సాంగ్స్ చేసింది. అప్పట్లో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ కోసం 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది..హీరోయిన్ గ మంచి ఫామ్ లో ఉన్న స్టేజి లో మన టాలీవుడ్ చందమామ సడన్ గ పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఇంకా కాజల్ మళ్ళి ఐటెం సాంగ్స్ చేయడం కష్టమే..

02. POOJA HEGDE IN ‘RANGASTALAM’!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు వస్తోన్న సమయంలో ‘రంగస్థలం’లో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించింది సౌత్ సెన్సేషన్ పూజా హెగ్డే. ‘జిగేలు రాణి’ అంటూ సిల్వర్ స్క్రీన్ పై ఆమె చేసిన హడావిడి మామూలుగా లేదు. ఈ పాట తన కెరీర్ కి మరో ప్లస్ పాయింట్..తను ఇప్పుడు కేవలం సౌత్ స్టార్ కాదు..పాన్ ఇండియా స్టార్..ఇలాంటి టైం లో పూజ మళ్ళి ఐటెం సాంగ్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

01. SAMANTHA IN ‘PUSHPA’!

రీసెంట్ గా మరో స్టార్ హీరోయిన్ సమంత.. పుష్పలో ఊ అంటావా ఊఊ అంటావా అంటూ హీటెక్కించింది. సమంత నెవర్ బిఫోర్ లుక్ లో ఒక రకంగా ఫాన్స్ కి షాకిచ్చిందనే చెప్పాలి. ఒక వైపు స్టార్ హీరోయిన్ గా సౌత్ మొత్తం సినిమాలు చేస్తూ.. మరో వైపు అల్లు అర్జున్ తో ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ సర్ ప్రైజ్ చేసింది సమంత. ఈ పాట అనుకున్న దానికంటే అసలు ఎక్స్ పెక్ట్ చెయ్యని రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

happy birthday R. Narayana Murthy!

Janhvi Kapoor charging a bomb for Tollywood Films