in

top 10 controversial movies of tollywood!

10. DUVVADA JAGANNADHAM

సినిమాలోని ఒడిలో బడిలో సాంగ్ చాలా పెద్ద కాంట్రవర్సీ క్రీట్ చేసింది. ఎంత అంటే మూవీ డైరెక్టర్ ఆ సాంగ్ లోని లిరిక్స్ కొన్ని చేంజ్ చేసే అంతగా. బ్రహ్మీని సంఘాలు ఈ ప్రొటెస్ట్ చేసాయి. సినిమా రిలీస్ కు కొన్ని రోజులు ముందు పాటను మర్చి డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళి రి రిలీస్ చేయడం జరిగింది.

09. BUS STOP

మూవీ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలోని సీన్స్ చాలా వరకు వల్గర్ గా ఉన్నాయి అని చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేసాయి. సంధ్య థియేటర్ ముందు ఫ్లెక్సీ లు కూడా కాల్చి పారేశారు.. యూత్ ను చెడగొట్టే విదంగా ఈ సినిమాను తీశారు అంటూ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ నన హంగామా చేసారు..సినిమా రిలీస్ అయ్యి విజయం సాధించింది.

08. BEJAWADA

బెజవాడ గ్యాంగ్ వార్ అండ్ రౌడీ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకు ఎక్కించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, అయితే టైటిల్ లో వాళ్ళ సిటీ పేరు పక్కన రౌడీలు అని పెట్టడం అక్కడి జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సామాన్య ప్రజలు కూడా ఈ సినిమా ను వ్యతిరేకించడం విశేషం, ఇంకా చేసేదేమి లేక టైటిల్ లో నుండి రౌడీలు అని తీసేసి సినిమాను రిలీస్ చేసారు.

07. KRISHNAMVANDE JAGADGURUM

బీజేపీ పార్టీ లీడర్ గాలి జనార్ధన రెడ్డి గారిని మూవీ లోని మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించారు అందుకోసమే సినిమాలో బళ్లారి మైనింగ్ కాన్సెప్ట్ ను పెట్టారంటూ పొలిటికల్ పార్టీస్ చాల గొడవ చేసాయి. పొలిటికల్ పార్టీస్ చేసిన ఈ రచ్చ కు నిజంగా అర్ధం ఉంది అనే చెప్పాలి, ఇంత సెన్సిటివ్ ఇష్యూ మీద సినిమా తీసిన డైరెక్టర్ గట్స్ ను మెచ్చుకోవాలి.

06. DENIKAINA READY

సినిమా గురించి కొన్ని బ్రహ్మీని ఆర్గనైజషన్స్ కంప్లైంట్ చేశాయి.. పెద్ద సిన్ ఏ క్రియేట్ చేశాయి.. కానీ సినిమాలో ఏం లేదు.. అన్ని కామన్ గా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి కానీ ఎం ఉపయోగం లేదు.. సినిమా రిలీస్ అయ్యి మంచు వారికి మంచి విజయాన్ని ఇచ్చింది ఈ సినిమా.

05. CAMERAMAN GANGATHO RAMBABU

కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించిన డైలాగ్స్ ఇందులో ఉన్నాయి అని.. తెలంగాణ మూమెంట్ ని కూడా చాలా వ్యతిరేకంగా చూపించారు అని సినిమా విడుదల కాకూడదు అని కాంట్రవర్సీ చేశారు.. కానీ సినిమా అయితే రిలీజ్ అయ్యింది..గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ తరువాత పవర్ స్టార్ నటించిన ఈ సినిమా అందరిని నిరాశ పరిచింది.

04. ARJUN REDDY

విజయ్ దేవరకొండా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద కాంట్రవర్సీగా మారింది. అంతేకాదు.. ఈ సినిమాలో లిప్ కిస్ లు ఎక్కువ ఉన్నాయి అని కొందరు రాజకీయ నాయకులూ సినిమా పోస్టర్లను చించేశారు కూడా.. అయితే నిజానికి వారు అలా చెయ్యడం వల్లే అర్జున్ రెడ్డి సినిమా పాపులర్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

03. SYE RAA

మెగాస్టార్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సై రా’ సినిమా గురించి కూడా వివాదాలు తెగ చుట్టుముట్టాయి, రామ్ చరణ్ తమ నుండి ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ గురించి చాల విషయాలు తెలుసుకొని వారికీ ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని నరసింహ రెడ్డి గారి కుటుంబ సభ్యలు ఆరోపించారు, కొణిదెల ఆఫీస్ దగ్గర, చిరు ఇంటి ముందు ధర్నాలు కూడా చేసారు. చివరికి కోర్ట్ వరకు వెళ్లి ఈ మ్యాటర్ గురించి కోర్ట్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో సినిమా సేఫ్ గా రిలీస్ చేసారు చరణ్.

02. KAMMA RAJYAMLO KADAPA REDLU

సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే..జగన్, చంద్ర బాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, KA పాల్, అందరిని తెర మీద ఆడుకున్నాడు వర్మ, రామ్ గోపాల్ వర్మ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది.. ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. ఈ సినిమాపై టీవీలలో డిబేట్ లు, గొడవలు, పేరు మార్చడం అబ్బో చాలానే జరిగాయి.

01. LAKSHMI’S NTR

బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కు ధీటుగా ఈ సినిమాను తీసి తన పంతం ను నెగ్గించుకున్నారు వర్మ లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎలా వచ్చారు అనేది తీస్తూ. ఎన్టీఆర్ చివరి రోజులు మరణం అంటూ చంద్రబాబు నాయుడుని ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. కానీ సినిమా చూస్తే ఏం లేదు.. అయినా దీనిపై పెద్ద గొడవ అయ్యింది.

balakrishna satire on chiru!

Actress’s favorite hero’s quiz!