మైదాన్’ మూవీ ప్రమోషన్లలో భాగంగా బోనీకపూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మైదాన్ మూవీ’ ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా బోనీకపూర్ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన భార్య శ్రీదేవి బయోపిక్ గురించి మాట్లాడుతూ..
నా భార్య వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేది. వ్యక్తిగత విషయాలు బయటికి తెలియాల్సిన అవసరం లేదని తన అభిప్రాయం. ఆమె ఆలోచలన్ని, వ్యక్తిత్వాన్ని నేను చాలా గౌరవిస్తాను..బయోపిక్ అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉంది. అందుకే నా భార్య ఆలోచనల ప్రకారం తన బయోపిక్ తీయడానికి నేను ఒప్పుకొను. నేను బతికి ఉన్నంత వరకు ఆమె బయోపిక్ రాదు. ఎవరూ తీయలేరు అని బోనీకపూర్ చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే..చాలా రోజులుగా శ్రీదేవి బయోపిక్ చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్యలో బోనీకపూర్‌తో సంప్రదింపులు జరిగినట్లు వార్తలు కూడా వచ్చాయి..!!