in

Jr NTR all set to host a new show for a OTT platform?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సినిమాలే కాకుండా ఇతర బిజినెస్‌ల్లోకి ఎంటర్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్‌ బాబు, విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌ థియేటర్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ సాధించారు. అయితే తాజాగా మరో స్టార్‌ హీరో మూవీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఓటీటీ బిజినెస్‌లోకి ఎంటర్‌ అవుతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా ఓ ఓటీటీ సంస్థ తారక్‌ కు భారీ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీకి చెందిన నిర్వాహకులు టాక్‌ షో ఒకటి ప్రారంభిస్తున్నామని దీనికి హోస్ట్‌ గా తారక్‌ వ్యవహరించాలని కోరినట్లు టాక్‌..అయితే ఈ షోకు రెమ్యునరేషన్‌ ఇవ్వడమా లేదా ఓటీటీలో భాగస్వామ్యం ఇవ్వడమా అనే దానిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై తారక్‌ నుంచే రెస్పాన్స్‌ రావాల్సి ఉంది. సినిమాల విషయానికి వస్తే.. తారక్‌ ప్రస్తుతం కొరటాల శివతో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నాడు.!!

catherine tresa becomes lucky girl for icon star!

PATHOS RAAGA SIVARANJANI FOR DUET???