in

Anu Emmanuel has officially slammed retirement rumours!

నాని నటించిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్. తొలి సినిమాతోనే తన అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ బ్యూటీ.. అనతికాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్ సరసన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అయితే, గత కొంతకాలంగా ఆమె వెండితెరకు దూరంగా ఉండటంతో.. అను ఇమ్మాన్యుయేల్ సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పబోతోందంటూ నెట్టింట, సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు ఆమెను నేరుగా సంప్రదించగా..ఈ రూమర్స్‌పై అను గట్టిగానే స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘‘నో నో.. నేను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. ఎప్పటికీ అలా చెప్పను. ఈ వదంతులను ఎవరు పుట్టించారో తెలియదు కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. నేను ఇండస్ట్రీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మంచి వైవిధ్యమైన కథలు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల కోసమే ఎదురుచూస్తున్నాను. త్వరలోనే నా తదుపరి చిత్రాలకు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌లను ప్రకటిస్తాను’’ అని స్పష్టం చేశారు. దీంతో తన కెరీర్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాలకు ఆమె ఒక్క మాటతో పుల్‌స్టాప్ పెట్టేశారు..!!

nani says over 1 lakh hair braid sold after aaya sher song!