ashu reddy cheating case: high court rejects her petition
లండన్‌లో ఉంటున్న తన కుమారుడు వై.వి.ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి, ఆమె తల్లి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వై. సత్యనారాయణమూర్తి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పేరుతో ఎన్నారై వ్యాపారవేత్తను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన క్రిమినల్ కేసులో సినీ నటి అషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ [...]











