in

happy birthday sr ntr!

ముద్దుగా తెలుగోళ్లు అంతా ‘ఎన్టీఆర్’ అని పిలిచే ఆ సీనియర్ తారకరాముడి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం..యుగానికి ఒక్కడు.. తెలుగు జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన మహా పురుషుడు.. ఆయన మాట ఒక సంచలనం.. ఆయన బాట స్ఫూర్తిదాయకం.. తెలుగుజాతి సినిమాను మలుపు తిప్పిన మహా సంకల్పం.. రాజకీయాల్లో ప్రభంసనం.. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవ పతాక.. ప్రజాహిత పాలనతో ప్రజలకు చేరువైన మహానాయకుడు.. సంక్షేమ పథకాలకు ఊపిరిపోసిన మహనీయుడు.. ఆయనే ‘నందమూరి తారక రామారావు’..

33 ఏళ్ల సినిమా జీవితం..13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా తెలుగు నాట చెరిగిపోని ముద్రవేసిన ఎన్టీఆర్..విశ్వ విఖ్యాత నట సార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన అనేక పౌరాణిక, జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరిత పాత్రలు ఎన్నో చేశారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు నాట దేవుడై నిలిచాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఎన్టీఆర్ నటించారు. నిర్మాత, దర్శకుడిగా పలు చిత్రాలు నిర్మించారు..నేడు ఆయన 102 వ పుట్టినరోజు సందర్భంగా స్మరించుకుందాం..!!

manchu vishnu’s Kannappa’s Hard Drive Missing!

tollywood eyes on kannada beauty rukmini vasanth!