in

malayalam beauty Femina George onboard for Allu Arjun raaka!

కాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టులోకి మలయాళ నటి ఫెమీనా జార్జ్ కూడా అడుగుపెట్టారు..

‘మిన్నల్ మురళి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫెమినా, ‘రాకా’లో భాగం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ అని ఆమె తెలిపారు. అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవడం ఒక కల నిజమైన క్షణమని ఆమె అభివర్ణించారు. అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ సినిమా చూసినప్పటి నుంచి తాను ఆయనకు పెద్ద అభిమానిని అయిపోయానని ఫెమీనా పేర్కొన్నారు. తన పాత్ర నిడివి చిన్నదే అయినా, ఇంత భారీ చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు..!!

happy birthday Ilaiyaraaja!

f cube ‘Fahadh Faasil’!