
మౌనీ రాయ్, దిశా పటానీలు గత కొంతకాలంగా అత్యంత క్లోజ్‌గా ఉంటున్నారు. తరచూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, పార్టీల్లో జంటగా సందడి చేయడం, ఒకరినొకరు హగ్ చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు వీరిపై లెస్బియన్స్ అంటూ రూమర్స్ సృష్టించారు. దిశా పటానీ కోసమే మౌనీ రాయ్ తన వైవాహిక బంధాన్ని కూడా వదులుకుందనే స్థాయికి ఈ పుకార్లు వెళ్లాయి. తమపై వస్తున్న ఈ నెగెటివ్ ట్రోలింగ్‌కు, రూమర్లకు చెక్ పెట్టాలని మౌనీ రాయ్ భావించింది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీతో కలిసి ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ..నా లిటిల్ సిస్టర్ను చాలా మిస్సవుతున్నాను అని క్యాప్షన్ పెట్టింది..
తామిద్దరం లెస్బియన్స్ కాదని, అక్కాచెల్లెళ్ల లాంటి స్వచ్ఛమైన స్నేహితులమని ప్రపంచానికి చాటిచెప్పడమే మౌనీ ఉద్దేశం. అయితే ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మౌనీ రాయ్ దానిని ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది. మౌనీ రాయ్ ఆ పోస్ట్‌ను అంత అర్ధాంతరంగా డిలీట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చలు మరింత ఎక్కువయ్యాయి. నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు: పోస్ట్ పెట్టగానే నెటిజన్ల నుంచి నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ విపరీతంగా రావడంతో తట్టుకోలేక డిలీట్ చేసిందా? అనే అనుమానం తెర మీదకు వస్తుంది. లేదా తొందరపాటులో ఆ క్యాప్షన్ పెట్టాననే ఉద్దేశంతో వెనక్కి తగ్గిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు..!!

