in

Mamitha Baiju onboard for ”Yellamma’ With DSP?

ల్లమ్మ సినిమా విషయంలో మొదటి నుంచీ హీరో, ఫీమేల్ లీడ్ విషయంలో చాలా తతంగం నడుస్తూ వస్తుంది. మొదట ఓ హీరోతో అనుకోని తర్వాత ఇంకొకరు ఆ తర్వాత ఫైనల్ గా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చేయడం వరకు వస్తే హీరోయిన్ గా కూడా మొదటిగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు వినిపిస్తే తర్వాత స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు వచ్చింది. కానీ లేటెస్ట్ గా కొత్త హీరోయిన్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది..

దళపతి విజయ్ జన నాయగన్ ఆఖరి సినిమాలో కీలక పాత్ర పోషించిన మలయాళం బ్యూటీ మమితా బైజు ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో లాక్ అయినట్టు కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే చాలామందికి ఇలాంటి విలేజ్ డ్రామాలో మమితా సెట్ అవుతుందా అనే డౌట్స్ కూడా రావచ్చు. కానీ రీసెంట్ గా ధనుష్ తో ‘కర’ అనే సినిమాలో ఆమెని చూస్తే ఇలాంటి రోల్స్ ని కూడా ప్రేమలు, డ్యూడ్ బ్యూటీ అవలీలగా చేయగలదు అని అర్ధం అవుతుంది. మరి ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారిక క్లారిటీ వస్తేనే తెలుస్తుంది..!!

Mouni Roy posted ‘Missing Lil Sis’ Disha Patani and deletes it!