
శ్రీలీల ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తన అద్భుతమైన డాన్స్, చలాకీతనంతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, ఈ అమ్మడికి టాలీవుడ్‌తో పాటు ఇతర పరిశ్రమల్లోనూ వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ‘D-55’ ప్రాజెక్ట్‌తో పాటు, బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్ సరసన ‘ఆషికీ-3’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
భాషా భేదాలు లేకుండా ఇండియన్ సినిమాలో దూసుకుపోతున్న శ్రీలీల..తాజాగా భాష, సంస్కృతిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివిధ చిత్ర పరిశ్రమల్లో పనిచేయడంపై ఆమె మాట్లాడుతూ..”నేను ప్రతి భాషను ఎంతో గౌరవిస్తాను. ప్రస్తుతం నాలుగు, ఐదు భాషల్లో ప్రాజెక్టులు చేస్తున్నాను. నేను ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా, స్టేజ్ పైన ఉన్నంతసేపూ అక్కడి స్థానిక భాషలోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రాంత ప్రజలకు, వారి సంస్కృతికి నేను ఇచ్చే కనీస గౌరవం అది” అని స్పష్టం చేసింది..!!

