in

sensational beauty Bhagyashri Borse’s Big Hopes on Lenin!

తెరపై భాగ్యశ్రీని చూసిన కుర్రాళ్లంతా ఈ అమ్మాయికి నటన తెలియక పోయినా ఫరవాలేదు. అలా తెరపై కనిపిస్తూ ఉంటే చాలానే అనుకుంటారు. అందువల్లనే పెద్దగా సక్సెస్ లు లేకపోయినా, అవకాశాలు మాత్రం వెతుక్కుంటూనే వస్తున్నాయి. వచ్చే నెల చివరి వారంలో ఈ సుందరి ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే ఒక టాక్ బలంగానే వినిపిస్తోంది..

అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ‘పెద్ది’ సినిమాలో భాగ్యశ్రీ కూడా మెరిసి ఉంటే బాగుండేదనే ఒక టాక్ ఇప్పుడు షికారు చేస్తోంది. ‘పెద్ది’లో జాన్వీకపూర్ కథానాయికగా నటించగా, ఐటమ్ సాంగ్ లో శృతిహాసన్ సందడి చేయనుంది. మార్కెటింగ్ పరంగా చూసుకుంటే, మేకర్స్ నిర్ణయం సరైనదే అయినా, గ్లామర్ పరంగా చూసుకుంటే, భాగ్యశ్రీ కూడా ఎక్కడో ఒక చోట మెరిసే ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ తరువాత సినిమాలో నైనా ఈ బ్యూటీకి ఛాన్స్ దొరుకుతుందేమో చూడాలి మరి..!!

Mamitha Baiju onboard for ”Yellamma’ With DSP?

Blast Zone!