ప్రముఖ సింగర్ సునీత మరోసారి వివాహానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత.. డిజిటల్ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో రెండో వివాహానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వీరివురి నిశ్చితార్థం ఇటీవల జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమెను అభిమానించే వారంతా సంతోషం వ్యక్తం చేశారు. డిసెంబర్ 27న వీరిద్దరి వివాహం జరగనుందని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
అయితే.. తాజాగా వీరి వివాహం వాయిదా పడినట్లుగా వార్తలు వినవస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల సునీత, రామ్‌ల వివాహం వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే వాయిదా పడటానికి కారణాలు తెలియరాలేదు. అయితే త్వరలోనే మంచి ముహూర్తం చూస్తారని మాత్రం తెలుస్తోంది. నూతన సంవత్సరంలో మంచి ముహూర్తం ఫిక్స్ చేసి సునీత, రామ్‌ల వివాహం జరిపించాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.