ప్రస్తుతం సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ఇక వీటితో పాటు సందీప్ కిషన్ హీరోగా ఎంవీవీ బ్యానర్‌లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రొడక్షన్‌లో వస్తుంది. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు “రౌడీ బేబీ” అనే టైటిల్‌ను ఖరారు చేసారు చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు.