దేవదాస్ కట్టా, ఈయన ఎవరు అనుకుంటున్నారా? ప్రస్థానం ఫెమ్ దేవా కట్టా గారి అసలు పేరు అదే. దేవా కట్టా గారు అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీర్ గ పని చేస్తున్న రోజుల్లో తృటిలో అమెరికన్ పోలీస్ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. అదే జరిగి ఉంటె అసలు దేవా కట్టా అనే డైరెక్టర్ తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయి ఉండే వారు కాదు.ఆటోమొబైల్ కంపెనీ లో పని చేస్తూనే తన స్నేహితులతో కలసి ” వలస” అనే ఒక షార్ట్ ఫిలిం కూడా చేసారు, తనలాగే అభిరుచి ఉన్న అమెరికన్ ఫ్రెండ్స్ చేస్తున్న ఇంకొక షార్ట్ ఫిలిం లో ఒక డాన్ కి అసిస్టెంట్ గ నటించవలసి వచ్చింది. ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఒక ఇంటి బ్యాక్ యార్డ్ లో షూటింగ్ జరుగుతున్నది, చేతిలో పిస్టల్ పట్టుకొని డాన్ పక్కన నిలబడి, హిందీ లో బూతులు తిడుతూ ఉండే రోల్ చేస్తున్నారు దేవా కట్టా గారు.
ఇంతలో తన స్నేహితుడు కాల్ చేస్తే అతనికి షూటింగ్ స్పాట్ కి రావటానికి డైరెక్షన్ చెపుతూ, చేతిలో గన్ తో రోడ్ మీదకు లోపలి కి తిరుగుతున్న దేవా కట్టా గారిని ఏడు, ఎనిమిది కార్ లలో వచ్చిన పోలీస్ ఆఫీసర్లు గన్ కింద పడేయమని హెచ్చరించారు,ఒక్క సారిగా జరిగిన పరిణామానికి ఆశర్యపోయిన దేవా గారు, వెంటనే గన్ కింద పడేసి, చేతులు పైకి ఎత్తి, షూటింగ్ జరుగుతుంది అని చెప్పారు. లోపలకు వచ్చిన పోలీస్ అది షూటింగ్ అని నిర్ధారించుకున్న తరువాత చెప్పారట, నువ్వు చాల లక్కీ ఏ మాత్రం భయపడి తప్పుగా ప్రవర్తించి ఉంటె, పది, పన్నెండు బుల్లెట్లు ని బాడీ లో ఉండేవి, ఇది నీకు పునర్జన్మ అని చెప్పి వెళ్లిపోయారట. ఏమాత్రం తేడా జరిగి ఉన్న అసలు దేవా కట్టా అనే డైరెక్టర్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయి ఉండే వారు కాదు.,