ఆ తమిళ్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన ఎన్టీఆర్?
ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రతి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కోసం సిద్ధమవుతోంది. జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్‌కుమార్, ఎన్టీఆర్‌కి ఒక మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేసినట్లు సమాచారం.
జైలర్ డైరెక్టర్ నెల్సన్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ మాస్ అప్పీల్‌కి తగ్గట్లుగా ROCK అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ టైటిల్ ఇంటెన్స్ మాస్ టచ్‌తో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చెబుతున్నారు. సెట్స్‌పైకి వెళ్లకముందే ఈ సినిమా చర్చలో ఉండటానికి కారణం, ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది యాక్షన్‌కు పూర్తి న్యాయం చేసే కొత్త స్టైల్ ప్రాజెక్ట్ అవుతుందనే అంచనాలే..!!