తాజాగా ఈమె ఇటీవల ఒక డాన్స్ షోలో అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు పిల్లల తల్లి అయినటువంటి ఒక మహిళ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. డాన్స్ చాలా అద్భుతంగా చేశారంటూ ఆ మహిళను ప్రశంసించడమే కాకుండా తనకు కూడా వచ్చి డాన్స్ చేయాలి అనే భావన కలిగిందని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటివరకు నేను ఎవరికీ చెప్పని ఒక రహస్యాన్ని కూడా ఇక్కడ చెబుతున్నట్టు వరలక్ష్మి తెలిపారు.
తాను కూడా ఇండస్ట్రీలోకి రావడానికి అంటే ముందుగా కొన్ని అవకాశాలు కోసం ప్రయత్నాలు చేశాను అయితే ఆ సమయంలో ఒక షోలో నటిస్తున్న నేను రోడ్డుపై డాన్స్ చేయాల్సి వచ్చింది అందుకే తాను రోడ్డుపై డాన్స్ వేశానని అందుకుగాను నాకు 2500 డబ్బులు వచ్చాయి అంటూ వరలక్ష్మి తెలిపారు. అయితే తాను రోడ్డుపై డ్యాన్స్ వేసాను అనే విషయాన్ని ఎవరు కూడా తప్పుగా ఆలోచించవద్దు అంటూ ఈ సందర్భంగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!