పిచ్చి పిచ్చి సినిమాలు చేసి ఆడియన్స్ టైమ్ అస్సలు వేస్ట్ చేయను అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను. సౌత్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ రోల్సే చేశారు. ఆ ఇమేజ్‌తోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టినా.. అనుకోకుండా వచ్చిన పింక్ మూవీ ఛాన్స్ అమ్మడి ఇమేజ్‌ను మార్చేసింది. తరువాత వరుసగా బేబీ, నామ్ షబానా, బద్లా, తప్పడ్ లాంటి సినిమాలు తాప్సీకి స్టార్ ఇమేజ్ తీసుకువచ్చాయి.
ఓ పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే..జుడ్వా 2 లాంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేస్తున్నారు. అయితే సడన్‌గా యూటర్న్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇక మీదట గ్లామర్ డాల్ రోల్స్ చేసేదే లేదని తెగేసి చెబుతున్నారు. అయితే తాప్సీ కామెంట్ మీద సెటైర్స్ కూడా గట్టిగానే పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు అలాంటి సినిమాలే చేసిన తాప్సీ ఇప్పుడు కమర్షియల్ సినిమాలన్ని టైమ్ వేస్ట్ అనటం కరెక్ట్ కాదంటున్నారు. మరి ఈ విషయంలో ఇండస్ట్రీ జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి..