in

Karnan Beauty rajisha To Romance Ravi Teja?

నుష్ హీరోగా నటించిన ‘ కర్ణన్’ చిత్రం ప్రస్తుతం సౌత్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. సామాజిక అణచివేత పై గతంలో అనేక చిత్రాలు వచ్చాయి. సహజసిద్ధమైన హావభావాలతో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మలయాళీ యంగ్ బ్యూటీ రజిషా విజయన్ పల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా నటించింది. కర్ణన్ చిత్రం ఆమెకు మరిన్ని ఆఫర్స్ తెచ్చిపెడుతుంది అనడంలో సందేహం లేదు..

త్వరలోనే రజిషా టాలీవుడ్ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ మహరాజ్ రవితేజ త్వరలో శరత్ మండవ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమం జరిగింది. మజిలీ ఫేం దివ్యాన్ష కౌషిక్ ఓ హీరోయిన్ గా ఎంపికైంది. మరో హీరోయిన్ రోల్ కోసం రజిషాతో చర్చలు జరుపుతున్నారు. ఇది కనుక ఓకే అయితే రజిషాకి టాలీవుడ్ లో మంచి ఆఫర్ దక్కినట్లే. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శామ్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడి మూవీలో నటిస్తున్నాడు.

Are you a virgin? Surekha Vani’s daughter shocking reply to netizen!

commercial movies are just time waste, says thapsi!