in

anchor rashmi gautham gets a chance in nagarjuna’s next!

కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గరుడ వేగ’ తరువాత ప్రవీణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరోవైపు విభిన్న చిత్రాలతో అలరించే నాగార్జున ఇటీవల ‘వైల్డ్ డాగ్’తో సత్తాచాటారు. ఇప్పుడు మరో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ తో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇదిలాఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రష్మీ గౌతమ్ నటించనుందని టాక్ వినిపిస్తోంది.

టీవీ షోలలో తన గ్లామర్ గుప్పిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మీ..అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా సందడి చేస్తూ అందాల ఆరబోతతో కుర్రకారు మతి పోగొడుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ తో మంచి గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని.. ఆ తరువాత వరుసగా పలు గ్లామరస్ మూవీస్ చేసింది. ఐదేళ్ల తరువాత ఇప్పుడు మరోసారి ప్రవీణ్ సత్తారు మూవీలో రష్మీ సందడి చేయనుందట. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ భామ ఛాన్స్ కొట్టేసిందట. మరి ఈ సినిమాలో రష్మీ ఎలాంటి రోల్ లో దర్శనమిస్తుందో చూడాలి.

commercial movies are just time waste, says thapsi!

Shruti Haasan opened up on divorce of her parents Kamal Haasan and Sarika!