బోనీ కపూర్ ఒక మీడియా ఛానల్ తో చేసిన ప్రైవేట్ ఛాట్ లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన కూతురు రామ్ చరణ్ సరసన నటించబోతోందని, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదమేనని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు శ్రీదేవి జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో చిరంజీవితో భాగం పంచుకుంటే..
ఇప్పుడు ఆమె తనయ రామ్ చరణ్ తో జోడి కట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సో ఆర్సి 16 బృందం చెప్పినా చెప్పకపోయినా న్యూస్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ వెంటనే ఆర్ఆర్ఆర్ లో ఉన్న ఇంకో హీరోతో జోడి కట్టే అవకాశం రావడం అదృష్టమే. ఈ లెక్కన ఎక్కువ హైదరాబాద్ లోనే గడపాల్సి రావొచ్చు..!!