గత వారం బిగ్ బాస్ 3 ఎపిసోడ్ లో భాగంగా అలీ రెజా ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం ఇంటి సభ్యులకే కాదు ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్ అని చెప్పాలి.ఇదిలా ఉండగా అలీ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడుబిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఇంటికి వెళ్లగానే తనకు ఒక బడ్ న్యూస్ ఎదురైందని తెలిపాడు. తాను బిగ్ బాస్ లో పాల్గొంటున్నప్పుడు తన మావయ్య చనిపోయాడు అని ఇంటికి వెళ్ళాక తెలిసిందని అలీ రెజా భావోద్వేగానికి లోనయ్యాడు.
నా కుటుంబ సభ్యులు బిగ్ బాస్ షో నా కెరీర్ కు చాలా కీలకం అని భావించారు.నేను గేమ్ పై ఫోకస్ చేయడానికి ఈ వార్తని నాకు చెప్పలేదు.నేను కెరీర్ లో సక్సెస్ సాధించాలి,ఇంకా ఎదగాలని కోరుకునే వారిలో మా మావయ్య ఒకరు.
ఎలిమినేట్ అయ్యి షాక్ లో ఇంటికి వెళ్ళిన నాకు ఈ వార్త మరింత బాధ కలిగించింది.ఇంతటి బాధలో కూడా న ఫ్యామిలీ నన్ను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించిందని అలీ తెలిపాడు.”నీ చివరి చూపుకు నోచుకోలేకపోయినందుకు బాధపడుతూనే ఉంటా… లవ్ యు ఫోరెవర్ మావయ్య” అని అలి రెజా తన ఇoస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.