in

action hero gopichand gayala katha!

తోట్టెంపూడి గోపీచంద్ , తెలుగు సినీ హీరో, స్వర్గీయ దర్శకుడు టి. కృష్ణ గారి కుమారుడు, తొలుత హీరో గ నటించి ఆ సినిమా పరాజయం కావటం తో “జయం”, “నిజం” మరియు “వర్షం”వంటి చిత్రాలలో నెగటివ్ రోల్స్ చేసి, మళ్ళి యజ్ఞం సినిమా తో హీరో గ రీఎంట్రీ ఇచ్చి యాక్షన్ హీరో గ స్థిరపడ్డారు. గోపీచంద్ ముఖం మీద, రెండు గాయం గుర్తులు ఉంటాయి, ఆ గుర్తుల తాలుకు జ్ఞాపకాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. యాక్షన్ హీరో కాబట్టి ఫైటింగ్ షాట్స్ లో గాయాలు అయి ఉంటాయి అనుకుంటారు, కానీ రెండు గుర్తుల వెనుక చిన్న నాటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఎడమ కనుబొమ పైన ఉన్న గాయం చిన్నప్పుడు తమ నానన్మ గారి ఊరిలు ఆడుకుంటూ ఉండగా, కావడి బద్ద తగిలి అయినా గాయం తాలుకు మచ్చ, ముక్కు మీద ఉన్న, ఇంకొక గాయం తాలుకు మచ్చ వెనుక కధ, చాల ప్రత్యేకం, సాధారణం గ పిల్లలు ఏదయినా తప్పు చేస్తే “వీడి ముక్కు కోసి పప్పులో పెట్టాలి” అంటుంటారు, దానిని ప్రాక్టికల్ గ చేసే ప్రయత్నం లో గోపీచంద్, అన్నయ్య ప్రేమఁచంద్ బ్లేడ్ తో గోపీచంద్ ముక్కు కోయబోయాడు. ఈ సంఘటన జరిగినప్పుడు గోపీచంద్ వయసు 4,5 సంవత్సరాలు ఉంటాయి , రక్తం చూసి భయపడిన ప్రేమ్చంద్ నానమ్మ ఇంటిలో దాక్కున్నాడు.ఆ తరువాత గాయానికి వైద్యం చేయటం జరిగింది కానీ దాని తాలుకు గుర్తు అలాగే నిలిచి పోయింది . గోపీచంద్ రష్యా లో బీటెక్ చదువుకుంటున్న సమయం లో డైరెక్టర్ గ తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ప్రేమ్చంద్ కార్ యాక్సిడెంట్ లో చనిపోవటం చాలా విషాదకరం. 8 సంవత్సరాల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న గోపీచంద్ అన్న మరణం తో ఒంటరి వాడయ్యాడు. విషాదం నుంచి కోలుకున్న గోపీచంద్ సినిమా హీరో అయ్యాడు. ఎంతో మంది సలహా ఇచ్చినప్పటికీ తన ముక్కు మీద ఉన్న గాయం తాలుకు గుర్తును , తన అన్నయ్య గుర్తుగా అలాగే ఉంచేశారు. హీరో గ ఎంతో ఎదిగిన, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవకాశం ఉన్న చేయించుకోకుండా, తన అన్నయ్య జ్ఞాపకం గ అలాగే ఉంచుకున్నారు.

“ALA VAIKUNTAPURAM LO” MOVIE STORY !

ANOTHER BAD NEWS FOR ALI REZA !