in

Dimple Hayathi is set to fire up the stage and big screen again!

వెండితెరపై తన గ్లామర్‌తో, అదిరిపోయే డాన్స్‌లతో యూత్‌ను ఉర్రూతలూగించే క్రేజీ అండ్ బోల్డ్ బ్యూటీ డింపుల్ హయాతి మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తనదైన అందం, ప్రత్యేకమైన అభినయంతో టాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ..ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. అందాల ఆరబోతతో పాటు మాస్ బీట్స్‌కు చిందేయడంలో దిట్ట అయిన డింపుల్ హయాతి.. తాజాగా టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్‌లో భాగం కాబోతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి.

విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదర్శకుటుంబం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా..నారా రోహిత్, నివేథా పేతురాజ్, యువినా పార్థవి, రాజా ప్రైవల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ తారాగణంతో కళకళలాడుతున్న ఈ ప్రాజెక్టులోకి తాజాగా గ్లామర్ బ్యూటీ డింపుల్ హయాతి కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది..!!

Katrina Kaif Post-Pregnancy Trolling Sparks Internet Fury!

Katrina Kaif Post-Pregnancy Trolling Sparks Internet Fury!

Matthew McConaughey to star in Maharaja Hollywood Remake?