in

“ALA VAIKUNTAPURAM LO” MOVIE STORY !

గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి, జులాయి ఘన విజయాలు సాధించాయి…అయితే వెళ్ళిద్దరు “అల వైకుంఠ పురం లో ” సినిమా తో…హ్యాట్రిక్ మీద కన్నేశారు అని తెలుస్తోంది…ఇక ఈ చిత్రం కథ ఇదే అంటూ కొన్ని కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 

కథలోకి వస్తే రెండు కుటుంబాల మధ్య విబేధాల కారణంగా చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరమైన కొడుకు(హీరో) … పెద్దయ్యాక తన ఇంటికే ఓ పని వాడిగా వెళ్తాడు. ఆ తరువాత హీరో వాళ్ళకి ఎలా దగ్గరవుతాడు.. మధ్యలో ఎదురైన పరిస్థితులేంటి అనేదే కధని తెలుస్తుంది. ఈ చిత్రంలో ధనవంతుల కుటుంబం అలాగే పేద కుటుంబం ఉంటాయి.వీరి మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఇద్దరు తండ్రులు తమ కొడుకులని పుట్టినప్పుడే మార్చుకుని పెంచుకుంటారు. అలా ధనవంతుడైనా కానీ పేదవాడిగా పెరుగుతాడు హీరో, పేదవాడైనా ధనవంతుడిగా పెరిగిన మరో వ్యక్తి ఎవరు? చివరికి వీరి జీవితం ఎలా సుకాంతం అయ్యింది అనేది మిగిలిన కథని తెలుస్తుంది.

త్రివిక్రమ్ గారి గత సినిమా అరవింద సమేత లో మిస్ అయ్యిన కామెడీ ఈ సినిమా లో పుష్కలంగా ఉంటుందట… వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే…

top 10 insanely expensive things owned by Allu Arjun!

action hero gopichand gayala katha!