[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]తం[/qodef_dropcaps] డ్రి నాగేశ్వరరావు కోరిక మేరకు అప్పట్లో నాగార్జున.. దగ్గుబాటి రామనాయడు కూతురిని పెళ్లిచేసుకున్నాడు. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు.. కొన్ని అనుకోని కారణాల వల్ల నాగార్జున దగ్గుబాటి రామానాయుడు కూతురు అంటే వెంకటేష్ చెల్లెలు విడిపోయారు.
దీంతో నాగార్జున వేరే పెళ్లి.. వెంకటేష్ చెల్లి వేరే పెళ్లి చేసుకున్నారు.. నాగార్జునకు వెంకీ చెల్లికి పుట్టిన కోడుకు నాగ చైతన్య 18 ఏళ్ళ వరుకు తల్లి వద్ద పెరిగి.. తండ్రి వద్దకు వచ్చాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దగ్గుబాటి అక్కినేని మధ్య కేవలం నాగ చైతన్య బంధం మాత్రమే ఉంది.
అందుకే.. ఆ బంధాన్ని ఇంకాస్త బలపర్చుకోడానికి అఖిల్ కి వెంకటేష్ కూతురిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే అఖిల్ తో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలు ప్రస్తుతం వైరల్ కూడా అవుతున్నాయి.
సరే.. వార్తలు వైరల్ అవుతున్నాయి. హల్ చల్ చేస్తున్నాయి. కానీ అప్పట్లోనే మీ దగ్గుబాటి, అక్కినేని బంధం నిలవలేదు.. మరి ఇప్పుడు ఎలా నిలుస్తుంది ? ముందే మొన్న అఖిల్ శ్రియ అనే అమ్మాయిని పెళ్లి వరకు తీసుకు వెళ్లి మళ్ళి సెట్ కాదు అని వెనకడుగు వేశారు.. మరి ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది.. వెంకీ గారు మీ కూతురిని నాగార్జున కొడుకు ఇచ్చి పెళ్లి చెయ్యకండి.. అంటూ నెటిజన్లు వెంకీకి సలహా ఇస్తున్నారు. మరి ఈ సలహాలపై మీరు ఎం అంటారు?