ఎన్ని వార్తలొచ్చినా ఇప్పటికీ మేకర్స్ మాత్రం ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో సన్నివేశాల కోసం రూ.11 కోట్ల ఖర్చుతో అయోధ్య సెట్ కూడా ఏర్పాటు చేశారని అంటున్నారు.
ఇందులో ఆయా పాత్రల్లో నటించనున్న రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ రెమ్యూనరేషన్పై కూడా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా కోసం స్టార్ హీరో రణ్బీర్ ఏకంగా రూ.250 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. ఆ మొత్తాన్ని పలు ఇన్స్స్టాల్మెంట్స్ ఒక్కో ఇన్స్స్టాల్మెంట్లో రూ.75కోట్ల చొప్పున తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సాయి పల్లవి ఏకంగా రూ. 18-20కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం..!!