తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయి.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది సొట్ట బుగ్గల చిన్నది తాప్సి. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. అప్పటిలో ఒకసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అంతే కాదు అప్పట్లో హీరోకి మార్కెట్ లేకపోతే తన రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోవాలి అంటు వ్యాఖ్యలు కూడా చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసినప్పుడు ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పుకొస్తు.. గ్లామర్ విషయంలో చాలా సార్లు అవమానాలు ఎదుర్కొన్నాని.. అదే కారణం కొంతమంది హీరోలా భార్యలు నన్ను ఇట్టపడేవారు కాదని చెప్పింది. ఎందుకంటే తమ భర్త హీరో పక్కన డిగ్ల్యామర్ ఉన్నవారు నటించండం వాళ్ళకు సిగ్గుచేటుగా భావించేవారని చెప్పుకొచ్చింది. అలా తమ భర్తల పక్కన వేరే హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారని చెప్పింది.