in

surekha vani’s daughter supritha about her boyfriend!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సురేఖావాణి. ఇక గత కొన్నేళ్లుగా ఆమె తన కూతురు సుప్రీతను కూడా హీరోయిన్ గా చేయడానికి పలు ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక సుప్రీతా అందచందాల గురించి కానీ, అమ్మడు పెట్టే హాట్ హాట్ ఫోటోషూట్ల గురించి కానీ సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సురేఖ సైతం, కూతురుతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్సులో చిందులు వేస్తూ కనిపిస్తుంటుంది.

మధ్యమధ్యలో ఈ తల్లీకూతుళ్లు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా సుప్రీత తన అభిమానులతో కలిసి చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి అడిగిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చింది. సుప్రీత చేసే రీల్స్ లో ఎక్కువగా నందు అనే కుర్రాడు కనిపిస్తూ ఉంటాడు. చాలామంది అతనిని సుప్రీత బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటారు. అదే విషయాన్ని ఒక నెటిజన్ అడిగాడు. నందుకు, మీకు ఉన్న రిలేషన్ ఏంటి..? నందు బాయ్ ఫ్రెండా..? లేక బాయ్ బెస్టీనా అని అడిగాడు.

దీనికి తడుముకోకుండా సుప్రీత ‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు. కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్ ఫ్రెండ్స్’’ అని మొహమాటపడకుండా చెప్పేసింది. అంతకుముందు కూడా నందు తనకు మంచి ఫ్రెండ్ అని , అన్ని తనతోనే షేర్ చేసుకొంటానని చెప్పుకొచ్చింది. దీంతో నందు ఆమె స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

N.T.R JEEVITHAMLO JARIGINA VISHADAKARAM AYINA SANGATANA!

sai pallavi to play mahesh babu’s sister?