in

sai pallavi to play mahesh babu’s sister?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇదివరకే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఆల్రెడీ జరిగిపోయింది. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ లోనూ, త్రివిక్రమ్ పవర్ స్టార్ ‘భీమ్లా‌నాయక్’ చిత్రం షూటింగ్ బిజీలోనూ ఉన్నారు. అతి త్వరలో ఈ ఇద్దరి కలయికలో సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలు అయిపోగానే వీరిద్దరి కలయికతో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఈ మూవీ సిస్టర్​ సెంటిమెంట్​తో రూపొందనుందని తెలిసింది. హీరో చెల్లెలు పాత్ర సినిమాకి చాలా కీలకం కానుందట . అందుకే మహేశ్​కు సోదరిగా సాయిపల్లవిని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇదివరకు మెగాస్టార్​ చిరంజీవి ‘భోళాశంకర్’​ చిత్రంలో చిరుకు సోదరిగా నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ రీమేక్స్ చేయకూడదని డిసైడయ్యానని, అందుకే తనకొచ్చిన ఆఫర్ ను తిరస్కరించానని సాయిపల్లవే స్వయంగా చెప్పింది. మరి మహేశ్​కు చెల్లిలిగా నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవనే ప్రచారం సాగుతోంది.

మరి సాయిపల్లవి నిజంగానే మహేశ్ కు చెల్లెలిగా నటించబోతుందేమో చూడాలి..ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనుంది. మరో కథానాయికను ఎంపిక చేసే ప్రక్రియలో చిత్రబృందం ఉందని తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్​ షూటింగ్​ ఏప్రిల్​ నుంచి ప్రారంభంకానుందట. మొదటి షెడ్యూల్ లో మహేశ్ బాబుపై ఒక సాంగ్, ఫైట్ చిత్రీకరిస్తారట. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

surekha vani’s daughter supritha about her boyfriend!

TOP 10 HIT AND MOST POPULAR FOLK SONGS IN TELUGU MOVIES!