in

Sreeleela Rejects alcohol and betting apps deal?

శ్రీలీల మంచి ఫామ్ లో ఉంది..ముఖ్యంగా హీరోయిన్స్ క్రేజ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. అందుకే హిట్ ఫ్లాఫ్ తో సంబంధం లేకుండా సినిమాలు, యాడ్స్, రిబ్బన్ కట్టింగ్స్, అని క్యాష్ చేసుకుంటారు. కానీ ఈ విషయం లో శ్రీలీల చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన కున్న క్రేజ్ ని వినియోగించుకుని, డబ్బే ముఖ్యం అని , తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని, తెలుస్తోంది. శ్రీలీల పారితోషికం 3 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటోందని సమాచారం..

అంతే కాక  ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన కొన్ని ఆఫర్స్ ని తిరస్కరించిందని టాక్. బెట్టింగ్ యాప్ లకు, మద్యం బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేసే ఆఫర్ వస్తే, ఇలాంటివి చేయనని నిక్కచ్చిగా  ఆ ఆఫర్లకు నో చెప్పిందని సమాచారం. భారీ పారితోషికం ఇస్తామన్నా నో చెప్పిందట. ఈ విషయం బయటికి రావటంతో  శ్రీలీల డెడికేషన్ ని, రూల్స్ ను అంతా ప్రశంసిస్తున్నారు..!!

Rakul Preet opens up about relationship with Jackky Bhagnani!

yesteryear anchor Udaya Bhanu Is Back!