in

yesteryear anchor Udaya Bhanu Is Back!

ఉదయభాను..నిన్నటి తరం బుల్లితెర ప్రేక్షకులకు బా‌గా తెలిసిన పేరిది. ఒకప్పుడు యాంకరింగ్‌కు పర్యాయపదంగా మారిన ఉదయభాను ఆ తర్వాత పెళ్లి చేసుకుని టీవీ ప్రేక్షకులకు దూరమయ్యారు. ఇన్నేళ్లకు మళ్లీ అభిమానులను పలకరించేందుకు ఇంటింటికీ వస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం కానున్న ‘సూపర్ జోడీ’ అనే డ్యాన్స్ ప్రోగ్రాంకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను జీతెలుగు విడుదల చేసింది.

ఈ నెల 28 నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభం అవుతుందని, గోల్డెన్ లేడీ ఉదయభాను ప్రోమో అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఉదయభాను తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. ‘ఆపొద్దు అమ్మా’ అని తన పిల్లలు చెప్పడంతో సూపర్ జోడీ ప్రోగ్రాంతో యాంకర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వెల్లడించారు. సూపర్ జోడీ ప్రోగ్రాంకు సీనియర్ నటి మీనా జడ్జిగా వ్యవహరిస్తున్నట్టు చెబుతూ మరో వీడియోను కూడా జీ తెలుగు విడుదల చేసింది..!!

Sreeleela Rejects alcohol and betting apps deal?

RCB Gifts Team Jersey To Prabhas And Salaar Team!