తమిళ్, కన్నడ, మలయాళం నుంచి తెలుగు పరిశ్రమకు హీరోలు వలస వచ్చేస్తున్నారు. టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంటే ఆల్ ఇండియా స్టార్ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారు. స్టార్ హీరోల ఆలోచనలు కూడా ఇలానే ఉన్నాయి. రీసెంట్గా తమిళ స్టార్ హీరో విజయ్‌తో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో పాన్ ఇండియా తెలుగు మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ఇంత వరకూ మాతృభాష తమిళం నుంచే ఇంత పెద్ద సినిమా చేయలేదు విజయ్. తన ఇమేజ్ను పెంచుకోవడానికి టాలీవుడ్ మీద ఆధారపడబోతున్నాడు.
ఇక మలయాళం నుంచి ఎక్కువగా తెలుగు తెరపై మెరవడానికి హీరోలు వస్తున్నారు. మన స్టార్ హీరో బన్నీ అక్కడ మల్లు అర్జున్ పేరుతో భారీ పాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అదే స్పూర్తితో.. మలయాళంలో యంగ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో కథను మలుపు తిప్పే ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నాడు ఫాహద్. మరో మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ కూడా గుణశేఖర్ డైరెక్షన్లో సమంత శంకుతల పాత్రలో నటించబోతున్న ‘శాకుంతలం’ సినిమాలో దుష్యంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు.