in

prabhas felt very difficult doing gay scene in chakram movie!

సినిమాల్లోకి రాకముందు వరకు తనకు ‘గే’లు, లెస్బియన్ల గురించి పెద్దగా తెలియదని.. కానీ ‘చక్రం’ సినిమాలో ఒక సన్నివేశంలో తాను గే లాగా చేయాల్సి వచ్చినపుడు చాలా ఇబ్బంది పడిపోయానని ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు. ఈ చిత్రంలో ఛార్మి ఫ్యామిలీలో పెద్ద గొడవ జరుగుతున్నపుడు.. అందరి దృష్టినీ దాన్నుంచి మళ్లించడం కోసం ప్రభాస్ ఉన్నట్లుండి గే అవతారం ఎత్తి యామినీ యామినీ అలాంటి అల్లరల్లరి చేస్తాడు.

ఈ సీన్ చేయడం తన వల్ల కాలేదని..తన కెరీర్లో బాగా ఇబ్బంది పడ్డ సన్నివేశాల్లో ఇదొకటని ప్రభాస్ చెప్పాడు. ఐతే కృష్ణవంశీ సంగతి అందరికీ తెలిసిందే అని.. ఆయన రాజీ పడకపోవడంతో చాలా కష్టపడి ఈ సన్నివేశాన్ని పూర్తి చేశానని యంగ్ రెబల్ స్టార్ అన్నాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన ‘చక్రం’ సినిమా.. ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ప్రభాస్‌కు మాత్రం మంచి పేరే తెచ్చిందీ సినిమా

Namrata Is a Super Woman, Mahesh’s Sister manjula Compliments!

south star heroes interested in telugu movies!