చిరంజీవి, బాలకృష్ణ గార్లతో డ్యాన్స్ చేయడం నైస్ ఎక్స్‌పీరియన్స్. వారిద్దరూ చాలా మంచి డ్యాన్సర్లు. ‘సుగుణ సుందరి’ పాట వైడ్‌గా రీచ్ అయ్యింది. ‘శ్రీదేవి చిరంజీవి’ పాట కూడా అద్భుతంగా వచ్చింది. ఇద్దరితోనూ పని చేయడం గొప్ప అనుభవం. బాలకృష్ణ గారు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. దేవుడ్ని బలంగా నమ్ముతారు. చిరంజీవి గారు చాలా ప్రశాంతంగా, సున్నితంగా ఉంటారు. వారిద్దరి నుండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నా.
ఇక ఇవి రెండూ ప్రత్యేకమైన సినిమాలు. కథలు, పాత్రలు, ట్రీట్ మెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. రెండు సినిమాలకి డిఫరెంట్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒక ఫ్యాన్.. ఆ హీరోని డైరెక్ట్ చేస్తే కచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. దీనికి నాన్న గారి (కమల్ హాసన్)తో లోకేష్ కనకరాజ్ తీసిన ‘విక్రమ్’ సినిమానే నిదర్శనం. బాలకృష్ణ గారితో గోపీచంద్, చిరంజీవి గారితో బాబీ పని చేస్తున్నపుడు సెట్‌లో ఆ ఎనర్జీ కనిపించింది. తెరపై కూడా ప్రేక్షకులు ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తారు. ఈ రెండింట్లో నేను నటిస్తున్నప్పుడు నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారు’’.