
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]న[/qodef_dropcaps]oదమూరి బాలకృష్ణ సినిమాలో రోజా ఒక ఇంటరెస్టింగ్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య తన 105 వ చిత్రం లొ నటిస్తున్నాడు, ఈ సినిమా కి సంబంధించి ఇటీవలే హైదరాబాద్ లొ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కాగా తమిళ్ డైరెక్టర్ కె ఎస్ రవి కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 105 సినిమా తరువాత బాలకృష్ణ బోయపాటితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం వై సి పి పార్టీ ఫైర్ బ్రాండ్ అలనాటి హీరోయిన్ రోజాను బోయపాటి సంప్రదించినట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నెగిటీవ్‌గా కనిపించే పాజిటీవ్ పాత్ర అది రోజాకు ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని బోయపాటి ఆలోచన అట. కానీ ఆ పాత్ర ప్రస్తుత రాజకీయాల గురించి ఉండడంతో రోజా నో చెప్పినట్టు సమాచారం. రోల్ లొ కొద్దిగా చేంజెస్ చేస్తే రోజా రి ఎంట్రీ కి సై అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.