in

Nanaku prematho antunna agent athreya!

జెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” సినిమా హీరో నవీన్  పోలిశెట్టి ఆ సినిమా తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తాను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పటినించి “నీ గోల్ ఒక్కటే ఐ ఐ టీ” అని చెప్పే వారట నవీన్ తండ్రి, నవీన్ కూడా దాని కోసం కస్టపడి చదివాడు కానీ దురదృష్టవశాత్తు ఐ ఐ టీ లో సీట్ రాలేదు, యెన్ ఐ టీ భోపాల్ చదవవలసి వచ్చింది కానీ సాయి శ్రీనివాస్ ఈ మధ్య ఐ ఐ టీ లో చేరాడు,అదేంటి,యాక్టింగ్ మానేసి మళ్ళి కాలేజీ లో చేరాడు అనుకుంటున్నారా అయితే మీరు పప్పు లో కాలేసినట్లే.ఈ యంగ్ హీరో “ఛిచోరే” అనే హిందీ మూవీ లో సుశాంత్ సింగ్ రాజపుత్, శ్రద్ధ కపూర్ తో కలసి నటిస్తున్నాడు ఆ షూటింగ్ ఐ ఐ టీ ముంబై లో జరిగింది. ఆ సందర్భం లో బుక్స్ పట్టుకొని ఐ ఐ టీ క్లాస్ రూమ్ లో అడుగు పెట్టారు మన నవీన్ పోలిశెట్టి, ఆ విధంగా తన తండ్రి కోరిక తీర్చినట్లు అయింది. సామాన్యులకు ఎవరికీ ఉండని అవకాశం ఒక్క నటులకు ఉంటుంది,వాళ్ళు యాక్టర్ అయితే చాలు, డాక్టర్, లాయర్, పోలీస్ ఆఫీసర్ ఇలా  ఏదయినా అవ్వచ్చు. ఒక విధంగా అది వారి లక్ అనే చెప్పాలి.

mahesh and trivikram still afraid of that date?

roja to play a key role in balayya’s next?