in

India’s First: Rashmika Mandanna’s Underwater Action in Mysaa

Rashmika Mandanna’s Underwater Action

మైసా’ సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా ఎక్కువగా వినిపిస్తున్న రెండు విషయాలు రెండే. ఒకటి హీరోయిన్‌ రష్మిక మందన. రెండోది అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌. గోండు యువతిగా రష్మిక కనిపించబోతున్న ఈ సినిమాలో చేసే పోరాటాలు ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. ఇటీవల వచ్చిన టీజర్‌లో ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది కూడా. సినిమాలో క్లిష్టమైన అండర్‌ వాటర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం రష్మిక చాలా శ్రమించిందని ఆ వీడియో చూసినా, సినిమా టీమ్‌ చెప్పిన విషయాలు చూసినా అర్థమవుతోంది. ఈ సినిమాలో డూప్‌ మీద ఆధారపడకుండా, రష్మికనే స్వయంగా ఆ సన్నివేశాన్ని పూర్తి చేసిందని ఇప్పటికే టీమ్‌ చెప్పింది. తాజాగా సినిమా దర్శకుడు రవీంద్ర పుల్లె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని తెలిపారు..

ఓ కథానాయిక అండర్‌వాటర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ చేయడం ఇదే తొలిసారి. సవాలున్న ఈ సీన్స్‌ కోసం రష్మిక పెద్ద సాహసమ చేశారు. సాధారణంగా మనుషుల నీటి లోపల ఊపిరి తీసుకోకుండా సుమారు ఒక నిమిషం ఉండగలరు. కానీ సినిమాలోని ఈ సీక్వెన్స్‌ మూడున్నర నిమిషాల ఉంటుంది అని రవీంద్ర చెప్పారు..అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ కోసం నీటి లోపల రిహార్సల్‌ చేయడం కూడా సాధ్యం కాదు కాబట్టి డూప్‌ను పెట్టి చేద్దాం అని డైరక్టర్‌ అనుకున్నారట. ఆ సీన్‌ గురించి ఓ స్టంట్‌ వుమన్‌కి చెబితే ఆమె చేయలేను అని చెప్పేశారట. దీంతో రష్మికనే స్వయంగా చేస్తానంటూ ముందుకొచ్చిందట. అలా ఆ ఫైట్‌ను మూడు రోజుల పాటు షూట్‌ చేశామని తెలిపారు. ఈ సీన్‌ కోసం రష్మిక 20 గంటల పాటు నీటిలో ఉండాల్సి వచ్చిందట. దీని కోసం బ్రీత్‌ కంట్రోల్‌, డైవింగ్‌ టెక్నిక్‌ల విషయంలో ప్రాక్టీస్‌ చేశారట..!!

Urvashi Rautela demands 7,000 crore from the us AI company!