వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాకపోవడానికి కారణం ఇదేనంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ..పల్లవి, నేను కలిసి మళ్ళీ నటించకపోవడానికి ఓ బలమైన కారణము ఉంది అంటూ వివరించాడు. మేము కలిసి చేయాలని భావించం..మా సినిమా కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దానికి తగ్గటు డైరెక్టర్స్ కూడా మాకు కొన్ని కథలు చెప్పారు. ఇద్దరం కథలు విన్నాం..
కానీ వాటిలో ఏ కథ మాకు నచ్చలేదు. ఈసారి మేమిద్దరం కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా ‘ఫిదా’ ను మించి ఆ సినిమా స్టోరీ ఉండాలని భావించాం. లేదంటే ఇద్దరం కలిసి సినిమానే చేయకూడదని ఫిక్స్ అయ్యాం. అయితే ఇప్పటివరకు అలాంటి స్టోరి మాకు దొరకలేదు. దీంతో ఇప్పటివరకు మేము కలిసి నటించే అవకాశం రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. .!!