in

rana about his marriage!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ గా ఉన్న దగ్గుబాటి రానా ఇటీవ‌లే త‌ను ప్రేమించిన అమ్మాయితో ఉన్న ఫోటో అభిమానుల‌తో పంచుకొని అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చాడు. బంటీ – సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకోనున్నారు రానా. ఇటీవల దగ్గుబాటి రానా – మిహీకా బజాజ్ ల రోకా వేడుకను ఇరు కుటుంబాలు కలిసి నిర్వహించారు. ఇక ఆగస్టు 8న శుభముహూర్తాన రానా – మిహీకాల వివాహం వైభవంగా జరిపించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.తాజాగా తన వివాహం గురించి మాట్లాడిన రానా  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను వివాహం చేసుకునేందుకు ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నాను… నా ప్రేమికురాలు మహిక మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది… ఆమె నాకు నాకు కరెక్ట్ జోడీ అంటూ రానా తెలిపాడు. జీవితంలో అన్ని వాటంతట అవే సజావుగా సాగి పోతూ ఉంటాయి. ఇప్పుడు పెళ్లి అనేది కూడా అంతే సజావుగా సాగుతుందని నేను భావిస్తున్నాను. ఆమె చాలా మంచి మనసున్న అమ్మాయి. మా జంట ఇతరులకు ఆదర్శంగా గొప్ప జంటగా నిలుస్తుందని నమ్ముతున్నట్లుగా రానా తెలిపాడు.

this is why ‘rrr’ shoot delayed!

police arrested actor shaam!