in

this is why ‘rrr’ shoot delayed!

క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్స్ అన్నీ బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ మ‌న స్టార్స్ షూటింగ్‌ల‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో స్టార్ హీరోల సినిమాలు ఏవి సెట్స్ పైకి వెళ్ల‌డం లేదు. ఆ మ‌ధ్య ఆర్ఆర్ఆర్  చిత్ర ట్ర‌యిల్ షూట్ హైద‌రాబాద్‌లో ప్రారంభించాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని అర్ధాంత‌రంగా ఆపేశారు. దీనిపై  సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్ కుమార్ వివ‌ర‌ణ ఇచ్చారు.

క‌రోనాకి ముందు చిత్ర షూటింగ్‌ని 400-500 మందితో చేసాం. ఇప్పుడు 40-50 మందితో చేయాలంటే క‌ష్ట‌మే. అయిన‌ప్ప‌టికి సామాజిక దూరం పాటిస్తూ టెస్ట్ షూట్ చేసేందుకు ట్రై చేశాం. కాని క‌రోనా అంత‌కంత విజృంభిస్తున్న నేప‌థ్యంలో కొద్ది పాటి గ్యాప్ తీసుకుంటే ఉత్త‌మం అని ట్ర‌యిల్ షూట్ ఆపేశాం అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు సెంథిల్ కుమార్. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్‌ని ఒక‌సారి వాయిదా వేసిన ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కాని ఈ డేట్‌కి ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల కావ‌డం క‌ష్ట‌మే అని తాజా ప‌రిస్థితుల‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.

tarak’s suggestions to trivikram!

rana about his marriage!